AP News: నూతన మద్యం విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమవేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 18 Sept 2024 5:26 PM IST
AP News: నూతన మద్యం విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం
X

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమవేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా నూతన మద్యం విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజుగా నామకరణం చేస్తూ తీర్మానించింది.

వరదల పంట నష్టపరిహారాన్ని కౌలు రైతులకూ దక్కేలా చూడాలని కేబినెట్‌ నిర్ణయించింది. ముంపు సాయాన్ని అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వాలని మంత్రి మండలిలో నిర్ణయించారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేసింది ఏపీ కేబినెట్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story