AP Cabinet Reshuffle: ముగ్గురు మినహా అందరూ అవుట్

AP Cabinet Reshuffle: సీఎం జగన్ కేబినెట్‌లో ఎవరిని ఉంచుతారు... ఎవరిని సాగనంపుతారన్నదానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 4 April 2022 7:00 PM IST
AP Cabinet Reshuffle: All the Ministers Except Three to Resign
X

AP Cabinet Reshuffle: ముగ్గురు మినహా అందరూ అవుట్

AP Cabinet Reshuffle: సీఎం జగన్ కేబినెట్‌లో ఎవరిని ఉంచుతారు... ఎవరిని సాగనంపుతారన్నదానిపై పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్లను కేబినెట్‌లో కొనసాగిస్తారని నిన్నటి వరకు ప్రచారం జరిగినా వారిని కూడా తప్పిస్తారని తాజాగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 7న ఏపీ కేబినెట్ భేటీ జరగనుందని ప్రస్తుత మంత్రులకు అదే ఆఖరి సమావేశం కానుందని తెలుస్తోంది. అదే రోజు ప్రస్తుత సిట్టింగ్ మంత్రుల రాజీనామాలు చేయగా గవర్నర్ అదే రోజు ఆమోదం తెలుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.

ఇక కొత్త మంత్రుల లిస్టు సైతం గవర్నర్ కు ఈనెల 10న చేరుతుందని 11న కొత్త కేబినెట్ కొలువుదీరనున్నట్టు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ముగ్గురు మినహా అందరిని తప్పిస్తారంటున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు జగన్ చేస్తున్నారట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story