Ratan Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం

Ratan Tata: దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Oct 2024 1:19 PM IST
Ratan Tata: రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం
X

Ratan Tata: దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం తెలిపింది. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద బ్రాండ్‌ను సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. రతన్ టాటా ఎంతో కృషి చేశారని అన్నారు. రతన్ టాటా మృతి పారిశ్రామిక రంగానికే కాకుండా దేశానికే తీరనిలోటని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రతన్ టాటా మృతికి సంతాపంగా క్యాబినెట్ రెండు నిముషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించింది. రతన్ టాటా చిత్ర పటానికి పూలు వేసి ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముంబై బయలుదేరి వెళ్లారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story