Breaking News: రాజీనామాలు చేసిన ఏపీ మంత్రులు.. సాయంత్రమే..

Breaking News: రాజీనామాలు చేసిన మంత్రులు

Arun Chilukuri
Updated on: 7 April 2022 5:33 PM IST
AP Cabinet Ministers Resigned To Their Posts
X

Breaking News: రాజీనామాలు చేసిన మంత్రులు

Breaking News: అంతా అనుకున్నట్లుగానే ఏపీ కేబినెట్‌లో మంత్రులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు మధ్యాహ్నం ప్రారంభమైన కేబినెట్ ఖాళీ లెటర్ హెడ్‌లతో వెళ్లిన మంత్రులు కేబినెట్ భేటీలోనే వాటిపై త‌మ రాజీనామాలను చేశారు. ఈ లేఖ‌ల‌ను మంత్రులంతా సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతిలో పెట్టారు. ఈ లేఖ‌ల‌ను జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించ‌నున్న‌ట్టు స‌మాచారం.

గురువారం మ‌ధ్యాహ్నం ప్రారంభ‌మైన కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన అనంత‌రం మంత్రివ‌ర్గ పునర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌పై చ‌ర్చ జ‌ర‌గ్గా జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు మంత్రులంతా అక్క‌డిక‌క్క‌డే త‌మ రాజీనామాల‌ను స‌మ‌ర్పించారు. మంత్రుల రాజీనామాల స‌మ‌ర్ప‌ణ‌తో గురువారం నాటి కేబినెట్ భేటీ ముగిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story