AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet Meeting Today: అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపే ఛాన్స్...

Shireesha
Updated on: 28 Oct 2021 9:13 PM IST
AP Cabinet Meeting Today about Online Cinema Ticket, Cinematography Act and TTD | AP News
X

AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం 

AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకాల ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపనుంది. సినిమాటోగ్రఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణకు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. అలాగే వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ స‌మావేశాల నిర్వహణపై చర్చ జరుగే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇదే సమయంలో టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చర్చ, చట్ట సవరణపై చర్చించనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చ‌ట్ట స‌వ‌ర‌ణ‌, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటుపై ఏపీ కేబినెట్ సమావేశం చ‌ర్చంచే అవకాశం ఉంది.


Shireesha

Shireesha

Next Story