నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11గంటలకు మంత్రివర్గ సమావేశం

* సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించనున్న ఏపీ కేబినెట్‌

R Tripura Malini
Published on: 13 Dec 2022 9:41 AM IST
AP Cabinet Meeting Today
X

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11గంటలకు మంత్రివర్గ సమావేశం

Andhra Pradesh: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11గంటలకు మంత్రివర్గం భేట కానుంది. SIBPలో ఆమోదించిన పరిశ్రమలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కడప సున్నపురాళ్లపల్లెలో JSW స్టీల్స్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉత్తరాంధ్రలో ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎర్రవరం, సోమశిల వద్ద హైడ్రో స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్ భేటీలో ప్రస్తావన రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మండూస్‌ తుఫాన్‌, పంట నష్టంపై కేబినెట్‌కు వ్యవసాయశాఖ నివేదిక ఇవ్వనుంది. ఇక సంక్షేమ పథకాల అమలుపై కూడా మంత్రివర్గం సమీక్షించనుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story