AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet: అసెంబ్లీ సమావేశాల, సీపీఎస్ అంశంపై చర్చ

Jyothi
Published on: 7 Sept 2022 6:37 AM IST
AP Cabinet Meeting Today
X

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతున్న కేబినెట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

సీఎం జగన్ అధ్యక్షతన జరిగే కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలపై చర్చించనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ సమావేశంలో CPS అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే GPS అమలుపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి జీవోలను సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా YSR హెల్త్ హబ్స్ ఏర్పాటుపైనా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు SIPBకి కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు సమాచారం. ఇటీవల గ్రీన్ ఎనర్జీ రంగంలో 81వేల కోట్ల పెట్టుబడులతో పాటు మరిన్ని పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ అంశాలపైన చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక సచివాలయంలో 80కు పైగా కొత్త పోస్టులకు ఆమోదం తెలపనుంది. సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను ఈ కొత్త పోస్టులలో అసిస్టెంట్ డైరెక్టర్, సెక్రటరీలుగా ప్రభుత్వం నియమించనుంది.

Jyothi

Jyothi

Next Story