AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం.. పలు అంశాలపై కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్‌ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు చీరాల చేరుకోనున్నారు సీఎం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Aug 2024 11:04 AM IST
AP Cabinet Meeting Today
X

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం.. పలు అంశాలపై కీలక నిర్ణయాలు

AP Cabinet Meeting Today: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ కీలక భేటీ కానుంది. సెక్రటేరియట్‌లో ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతిలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చారు.

ఇక ఏపీ కేబినెట్‌ భేటీ అనంతరం చీరాలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు చీరాల చేరుకోనున్నారు సీఎం. ఆ తర్వాత చేనేత సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సదస్సు ద్వారా చేనేత కార్మికులకు వరాలు కురిపించే అవకాశం ఉంది. చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే ఛాన్స్‌తో పాటు ఏపీ ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు ద్వారా 25వేల ఉద్యోగాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే 26 సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ, 8వ తరగతి అర్హతతో 5లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story