కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ.. 27 ఎజెండాలతో మంత్రివర్గం సమావేశం

X
Highlights
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 27 ఎజెండాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ నడుస్తోంది. నివర్...
Arun Chilukuri27 Nov 2020 7:35 AM GMT
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. 27 ఎజెండాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ నడుస్తోంది. నివర్ తుపాను వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్థుల ధ్వంసంపై కేబినెట్‌లో చర్చిస్తున్నారు. అలాగే డిసెంబర్ 25న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ జగనన్న భూ రక్షణ పథకానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. ఖరీఫ్ 2019 ఉచిత పంటల బీమా కల్పనకు ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలోని మున్సిపల్ చట్టంలో మార్పులు, చేర్పులు చేస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Web TitleAP cabinet meeting started
Next Story