ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet meeting started: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
AP Cabinet meeting started: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ బేటీలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. సమావేశంలో కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతేకాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు పై కమిటీ వేసిన సందర్భంగా ఆ అంశం పై కూడా చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా చర్చించనున్నారు.
వైఎస్ఆర్ ఆసరా పథకంపై చర్చించనున్నారు. సెప్టెంబర్ 5న ఇచ్చే వైఎస్ఆర్ విద్యా కానుకకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరియు నాలుగేళ్లలో 27వేల కోట్లకు పైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభం పై చర్చించనున్నారు. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కి ఆమోదం తెలపడంతో పాటు కడప జిల్లా కొప్పర్తి లో ఎలక్ట్రానిక్ మనుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు పై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే భావనపాడు పోర్ట్ ఫేజ్ 1 నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.