ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..'అంబేడ్కర్‌ కోనసీమ' జిల్లాకు కేబినెట్‌ ఆమోదం

Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.

Arun Chilukuri
Published on: 24 Jun 2022 3:01 PM IST
AP Cabinet Meeting Ends
X

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..‘అంబేడ్కర్‌ కోనసీమ’ జిల్లాకు కేబినెట్‌ ఆమోదం

Cabinet Meeting: సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును ఖరారు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు.

కోనసీమ జిల్లా పేరు మార్పుపై కొద్ది రోజుల క్రితం జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. మంత్రి విశ్వరూప్ ఇళ్లకు నిప్పు పెట్టడం, ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించడం వంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్లపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు అల్లర్ల కేసులో ఇప్పటి వరకు వందమందికిపైగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్ల నుంచి కోనసీమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. నిన్నా మొన్నటి వరకు పోలీసు పహారాలో ఉన్న కోనసీమ ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం కన్పిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story