AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 38 అంశాలపై చర్చించిన మంత్రివర్గం

AP Cabinet Meeting Concluded
x

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 38 అంశాలపై చర్చించిన మంత్రివర్గం

Highlights

AP Cabinet Meeting: ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 38 అంశాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించింది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై కేబినెట్‌ చర్చించింది. అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 6వేల,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పోలవరం నిర్వాసితుల ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీల మినహాయింపునకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories