AP Budget 2026: ఏపీ బడ్జెట్ 2026-27: అసెంబ్లీకి బయల్దేరిన మంత్రి పయ్యావుల కేశవ్

AP Budget 2026-27 Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది.

Arun Chilukuri
Updated on: 14 Feb 2026 11:43 AM IST
AP Budget 2026: ఏపీ బడ్జెట్ 2026-27: అసెంబ్లీకి బయల్దేరిన మంత్రి పయ్యావుల కేశవ్
X

AP Budget 2026-27 Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన నివాసంలో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అసెంబ్లీకి బయల్దేరారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి ఆర్థిక శాఖ అధికారులు వేద ఆశీర్వచనాలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో బడ్జెట్‌కు అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ సుమారు రూ. 3.46 లక్షల కోట్ల నుండి 3.50 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మేలు చేకూరాలని ఆకాంక్షిస్తూ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు మంత్రికి, అధికారులకు తీర్థప్రసాదాలు అందజేసి, బడ్జెట్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు. సంక్షేమం మరియు అభివృద్ధి కలయికగా ఈ బడ్జెట్ ఉండబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story