AP Budget 2021-22: రేపు ఉదయం 8గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

AP Budget 2021-22: 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రేపు ప్రవేశపెట్టునున్నారు.

Arun Chilukuri
Updated on: 20 May 2021 2:51 PM IST
AP Budget 2021-22: Cabinet to Meet Tomorrow on Budget
X


AP Budget 2021-22: రేపు ఉదయం 8గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

AP Budget 2021-22: 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రేపు ప్రవేశపెట్టునున్నారు. కరోనా కారణంగా బడ్జెట్ సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేశారు. అందుకు ఉదయం 8గంటలకు జరిగే ఏపీ కేబినెట్‌లో బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఉదయం 9గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.

గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం కానుంది. బీఏసీ మీటింగ్ అయిపోయిన తర్వాత సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే బడ్జెట్ పై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత కరోనాపై ప్రత్యేక చర్చించి అసెంబ్లీని వాయిదా వేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story