Somu Veerraju Meets Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు

Somu Veerraju Meets Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ను కలిసిన సోము వీర్రాజు
x
Highlights

Somu Veerraju Meets Pawan Kalyan: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము...

Somu Veerraju Meets Pawan Kalyan: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజుకు ఈ సందర్భంగా పవన్‌ శాలువా కప్పి సత్కరించారు. ఏపీలో జనసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌ లో పవన్ ను వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజుకు శాలువా కప్పి పవన్ అభినందించారు. అనంతరం ఇరువురు కలిసి పలు విషయాలపై చర్చించారు. మరోవైపు, నిన్న సినీ నటుడు చిరంజీవిని కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజును అభినందించిన చిరంజీవి ఏపీ అభివృద్ధిలో జనసేన, బీజేపీ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories