Somu Veerraju: ఢిల్లీ టూర్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

* మూడ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న సోము వీర్రాజు * కేంద్ర మంత్రులు షెకావత్, కిషన్‌రెడ్డితో సమావేశాలు

Sandeep Reddy
Published on: 21 July 2021 11:43 AM IST
AP BJP President Somu Veerraju in the Delhi Tour For Next Three Days
X

సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)

Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. మూడ్రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న సోము వీర్రాజు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్, కేంద్ర టూరిజంశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలవనున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదంపై కేంద్రమంత్రి షెకావత్‌తో చర్చించనున్నారు. అలాగే, కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలపనున్నారు. ఇక, ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ నిపుణులు, ఇంజనీర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలను షెకావత్‌కు అందజేయనున్నారు. అదేవిధంగా కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డితో ఏపీ అభివృద్ధిపై చర్చించనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story