ఢిల్లీ టూర్‌లో ఏపీ బీజేపీ నేతలు బిజీబిజీ

ఢిల్లీ టూర్‌లో ఏపీ బీజేపీ నేతలు బిజీబిజీ
x
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనల సెగ ఢిల్లీని తాకింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతలే...

విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతోన్న ఆందోళనల సెగ ఢిల్లీని తాకింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతలే హస్తిన పెద్దలను కలుస్తున్నారు. ఢిల్లీలో పర్యటిస్తోన్న ఏపీ బీజేపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిన్న కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన సోము వీర్రాజు బృందం ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఏపీలో పరిస్థితిని వివరించారు. ఆంధ్రుల సెంటిమెంట్‌ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ మెమొరాండం ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షాతో కూడా సమావేశంకానున్న ఏపీ బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories