ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు యూటర్న్

X
Highlights
సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. జనసేనతో పొత్తు...
Arun Chilukuri5 Feb 2021 1:00 PM GMT
సోము వీర్రాజు బీసీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనే అందరూ భావించారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే.. తన వ్యాఖ్యల సోము యూటర్న్ తీసుకున్నారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయగలరా అని వైసీపీ, టీడీపీని ప్రశ్నించానన్నారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న సోము.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది తన పరిథిలోని అంశం కాదన్నారు. జేపీ నడ్డా, పవన్ కళ్యాణ్‌తో చర్చించి ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
Web TitleAP bjp chief Somu veerraju take u turn over making bc candidate as chief minister
Next Story