ఏపీ అసెంబ్లీలో నాలుగో రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

X
Highlights
వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడింది. వైసీపీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర...
Arun Chilukuri3 Dec 2020 12:09 PM GMT
వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడింది. వైసీపీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ ఎంత నచ్చజెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో, శాసనసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దాంతో, టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, మంతెన రామరాజు, జోగేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌ను సభ నుంచి ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే, సస్పెండైన సభ్యులతోపాటే మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
Web TitleAP Assembly Winter Sessions: TDP MLA's suspended for the fourth day
Next Story