దిశ బిల్లును కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం

దిశ బిల్లును కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

దిశ చట్టం బిల్లు నిన్న రద్దు చేసి.. తిరిగి మార్పులతో కొత్త బిల్లును హోం మంత్రి సుచరిత సభలో ప్రవేశ పెట్టారు. ఏదైన ఒక సంఘటన జరిగినప్పుడు దర్యాప్తును ఏడు...

దిశ చట్టం బిల్లు నిన్న రద్దు చేసి.. తిరిగి మార్పులతో కొత్త బిల్లును హోం మంత్రి సుచరిత సభలో ప్రవేశ పెట్టారు. ఏదైన ఒక సంఘటన జరిగినప్పుడు దర్యాప్తును ఏడు రోజుల్లోనే పూర్తి చేసే విధంగా బిల్లు తీసుకొస్తున్నామని హోంమంత్రి తెలిపారు. మహిళు, చిన్నారుల రక్షణ కోసం దిశ బిల్లుకు మరిన్ని మెరుగులు చేశామన్నారు మంత్రి సుచరిత. రాష్ట్రవ్యాప్తంగా 18 దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, విచారణ వేగవంతం కోసం డీఎస్పీస్థాయి అధికారిని నియమించినట్టు చెప్పారు.

తిరుపతి, మంగళగిరి, విశాఖలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దిశా చట్టానికి జాతీయస్థాయిలో 4 అవార్డులు వచ్చాయన్నారు. దిశా చట్టంతో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దిశా చట్టం వచ్చాక 3 కేసుల్లో ఉరిశిక్షలు పడ్డాయని వెల్లడించారు. దిశ యాప్‌ను లక్షలాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. మంత్రి ప్రసంగం తర్వాత దిశా చట్టసవరణ బిల్లును సభ ఆమోందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories