బ్రేకింగ్: అసెంబ్లీ నుంచి టీడీపీ నేతల సస్పెండ్

బ్రేకింగ్: అసెంబ్లీ నుంచి టీడీపీ నేతల సస్పెండ్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. ఏపీ రాజధానిపై చర్చ జరుగుతున్న...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. ఏపీ రాజధానిపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బుగ్గన ప్రసంగానికి టీడీపీ సభ్యలు అడ్డు తగిలారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకొని, వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. దాంతో 9 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెండ్ అయిన వారిలో నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, మద్దాల గిరిధర్ రావు, బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్, వై సాంబశివరావు, జి రామ్మోహన్ రావు ఉన్నారు. సభ జరగకుండా అడ్డుకుంటున్నారని, సభా కార్యక్రమాలకు విఘాతం కల్పిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం వీరిని సస్పెండ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories