AP Assembly Sessions: వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly Sessions: డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామిని ఎన్నుకునే అవకాశం
AP Assembly Sessions: వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly Sessions: వాడి వేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ డిప్యూటీ స్పీకర్‌గా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఎన్నికకానున్నారు. కోన రఘుపతి రాజీనామాతో ఆ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. మూడు రాజధానుల ప్రస్తావనతో రాజకీయ చర్చకు దారితీసింది. అమరావతి రాజధానిపై రాజకీయ రగడ చోటుచేసుకుంది. రాజధానిపై విస్తృతంగా చర్చకొనసాగుతోంది. ఈరోజు జరిగే సభలో 8 కీలకమైన బిల్లులు ప్రస్తావనకు రానున్నాయి. ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు బిల్లులను సభలో ప్రతిపాదించే అవకాశం ఉంది. బిల్లులను సభలో చర్చించి సముచిత నిర్ణయంతో ఆమోదించనున్నారు.
Next Story




