అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన వైసీపీ.. మూడు రాజధానుల ఇష్యూపై ఫోకస్..

AP Assembly Session From Tomorrow
x

అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన వైసీపీ.. మూడు రాజధానుల ఇష్యూపై ఫోకస్..

Highlights

AP Assembly Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది వైసీపీ.

AP Assembly Session: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమైంది వైసీపీ. విపక్షాల గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడం.. చేసింది చెప్పుకోవడమే వ్యూహంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని అధికార పార్టీ నిర్ణయించింది. మూడు రాజధానులపై ఫోకస్ పెట్టిన వైసీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ విధానం అనే సంకేతాలను ప్రజల్లోకి పంపేలా ప్లాన్ చేస్తోంది. పాలనా వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై చట్టసభల వేదికగా విస్తృత చర్చకు సిద్ధమవుతోంది.

అప్పులు, పెట్టుబడులు, వృద్ధిరేటు, ఇసుక, పోలవరం, మద్యం, విద్య, వైద్యంపై అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది అధికార పార్టీ. అంశాలవారీగా మంత్రులు, కీలక ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. టీడీపీ సభలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అసెంబ్లీ వేదికగా వాస్తవాలు చెబుతామని అంటున్నారు అధికార పార్టీ నేతలు. పలు అంశాలపై తమను సవాల్ చేసే చంద్రబాబు ఒక్క రోజు అయినా అసెంబ్లీకి రావాలి సమస్యలపై చర్చించాలని వైసీపీ నేతలు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories