జీవో 1పై అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ వివరణ.. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు..

జీవో 1పై అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ వివరణ.. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు..

Arun Chilukuri
Published on: 10 Jan 2023 6:20 PM IST
AP Addl DGP Ravi Shankar Clarifies on GO 1
X

జీవో 1పై అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ వివరణ.. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదు..

Ravi Shankar: జీవో 1పై ఏపీ అడిషనల్‌ డీజీపీ రవి శంకర్‌ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం విధించలేదన్నారు. అయితే షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఉందన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలతోనే జీవోను తెచ్చామన్న ఏడీజీపీ..1861 పోలీసు చట్టానికి లోబడే జీవో నెంబర్‌ 1 తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసులు వేదిక స్థలాన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. రహదారులు, రోడ్లపై సభలకు అనుమతి లేదన్నారు. ఈ జోవో ఉద్దేశం నిషేధం కాదని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story