పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
x
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్ డౌన్ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 23 నుంచి ఏప్రిల్‌...

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్ డౌన్ మొదలయింది. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మార్చి 23న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1, మార్చి 24న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, మార్చి 26న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 27న ఇంగ్లీష్ పేపర్-1, మార్చి 28న ఇంగ్లీష్ పేపర్ 2, మార్చి30న గణితం పేపర్-1, మార్చి 31న గణితం పేపర్-2, ఏప్రిల్1న సైన్స్ పేపర్-1, ఏప్రిల్ 3న జనరల సైన్స్ పేపర్-2, ఏప్రిల్ 4న సోషల్ స్టడీస్ పేపర్-1, ఏప్రిల్ 6న సోషల్ స్టడీస్ పేపర్-2, ఏప్రిల్7న సంస్కృతం, అరబిక్, పెర్షియన్, ఏప్రిల్ 8న ఒకేషనల్ పరీక్షలు జరుగనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories