Antarvedi Sri Lakshmi Narasimha Swamy : అంతర్వేదిలో రథం దగ్డం సమయంలో సీసీ కెమేరాలు ఎందుకు పనిచేయలేదు..భక్తుల ప్రశ్న

Antarvedi Sri Lakshmi Narasimha Swamy : అంతర్వేదిలో రథం దగ్డం సమయంలో సీసీ కెమేరాలు ఎందుకు పనిచేయలేదు..భక్తుల ప్రశ్న
x
Highlights

Antarvedi Sri Lakshmi Narasimha Swamy : తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అకస్మాత్తుగా అగ్నికి ఆహుతయిన విషయం తెలిసిందే.

Antarvedi Sri Lakshmi Narasimha Swamy : తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అకస్మాత్తుగా అగ్నికి ఆహుతయిన విషయం తెలిసిందే. ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేవస్థానం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సఖినేటిపల్లి, మలికిపురం మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.

అయితే దేవస్థానంలో అగ్నిప్రమాదం జరిగినపుడు దేవస్థానానికి సంబంధించిన సీసీ కెమరాలలో రికార్డు ఎందుకుకాలేదంటూ భక్తులు ఆలయ అధికారులను నిలదీశారు. సిసి కెమెరాలు పనిచేయక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ భక్తులు ఆందోళన కు దిగారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో ను సస్పెండ్ చేయాలంటూ ఆర్ ఎస్ ఎస్ , బిజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టారు. ఎవరైనా కావాలని స్వామివారి రథం తగలబెట్టారా, ప్రమాదవశాత్తూ జరిగిందా తేల్చాలని పట్టుపట్టారు. రాజోలు సిఐ దుర్గా శేఖర్ రెడ్డి తన సిబ్బంది తో ఘటనా స్థలానికి చేరుకుని వివాదం సర్ధుబాటు చేసే ప్రయత్నాలు ఫలించలేదు.

అర్ధరాత్రి తర్వాత జరిగిన రథం దగ్ధం ఘటనపై ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ అనురాధ ఆలయ వద్ద ఘటన స్థలానికి బయలుదేరారు. అయితే ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఇంకా చేరుకోలేదు. అయితే రథం దగ్ధంపై అంతర్వేది ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజగోపాల రాజా బహుదూర్ మొగల్తూరు కోట వంశీయులు కూడా తీవ్రంగా స్పందించారు, ఘటన దురదృష్టకరమని, వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రథం పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు.

మరో వైపు అంతర్వేదిలో నర్శింహస్వామి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఖండించారు. అంతర్వేది ఘటన దురదృష్టకరమన్నారు. రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలని, ఇది దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలని, హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమని ఆయన అన్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories