YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్

YS Viveka: అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను కలిసిన గంగాధర్ రెడ్డి

Sandeep Eggoju
Published on: 29 Nov 2021 4:11 PM IST
Another Twist in YS Viveka Death Case
X

వైస్ వివేకా రెడ్డి సుసులో మరి ట్విస్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను గంగాధర్ రెడ్డి కలిశారు. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు, సీఐ శ్రీరామ్ తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు. 10 కోట్లు సుపారీ తీసుకున్నట్టు చెప్పమంటున్నారని ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని బాధితుడు గంగాధర్ రెడ్డి కోరారు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story