Pawan Kalyan: వైసీపీపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మరో ట్వీట్‌

Another Tweet by Janasena Chief Pawan Kalyan on YCP
x

Pawan Kalyan: వైసీపీపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మరో ట్వీట్‌

Highlights

Pawan Kalyan: అమెరికాలోని మౌంట్‌రష్‌మోర్‌కు, విశాఖ రుషికొండకు పోలిక పెడుతూ సెటైర్‌

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వైసీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. మూడు రాజధానుల అంశంపై పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజధాని వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంటే... కేవలం మూడు రాజధానులకే ఎందుకు పరిమితమయ్యారని ప్రశ్నించారు. ఏపీని 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర'గా ప్రకటించాలని... 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి, 25 రాజధానులను ఏర్పాటు చేయాలని ఎద్దేవా చేశారు. ఏపీని వైసీపీ రాజ్యంగా మార్చుకోండని, ఈ విషయంలో సంకోచించకండి అంటూ విమర్శించారు. విశాఖ జిల్లాలోని రుషికొండ పర్వత శ్రేణుల్లో ఉన్న 'మౌంట్ దిల్ మాంగే మోర్' ధన- వర్గ- కులస్వామ్యానికి చిహ్నమని.. బూతులకు కూడా అని ట్వీట్ చేశారు. ఇక అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న మౌంట్ రష్ మోర్ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ- విశ్వాసాలకు ఇది నిదర్శనమని చెప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories