AP Congress: అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ మరో జాబితా విడుదల

AP Congress: తాజాగా 38 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు

Shashank Gullapelli
Published on: 22 April 2024 8:00 PM IST
Another List Of The Congress Party For The Assembly Has Been Released
X

AP Congress: అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ మరో జాబితా విడుదల

AP Congress: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మరో లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని పట్టుదలగా ఉన్న హస్తం పార్టీ.. ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. ఈ క్రమంలోనే 38 మంది అభ్యర్థుల పేర్లతో తాజాగా జాబితాను విడుదల చేసింది. గతంలో 114 స్థానాలకు వెల్లడించగా.. తాజాగా 38 నియోజకవర్గాలకు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రకటించిన 10 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఇప్పటి వరకు 142 స్థానాలకు హస్తం పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అరకు లోక్‌సభతో పాటు 8 అసెంబ్లీ సీట్లను సీపీఎంకు కేటాయించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకు 20 చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. పొత్తులో ఒకటి సీపీఎంకు వెళ్లిపోవడంతో మరో నాలుగు ఎంపీ, మిగిలిన అసెంబ్లీ స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story