మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు

Pinnelli Brothers: గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై మరో కేసు నమోదైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 May 2024 10:16 AM IST
Another Case Against Pinnelli Rama Krishna Reddy
X

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై మరో కేసు

Pinnelli Brothers: గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై మరో కేసు నమోదైంది. కండ్లకుంటకు చెందిన టీడీపీ ఏజెంట్ మాణిక్యం మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పిన్నెళ్లి సోదరులపై ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించి, కుటుంబసభ్యులను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపాడు. అయితే ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తమ పరిధిలోని అంశం కాదని రూరల్ పోలీసులు తిరస్కరించారని తెలిపాడు. దీంతో డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయిస్తే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సూచించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాలతో జీరో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసేందుకు రూరల్ పోలీసులు సిద్ధమయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story