Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి

Train Accident: అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 4 Dec 2025 11:28 AM IST
Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి
X

Train Accident: రైలు ఢీకొని ఇద్దరు మృతి

Train Accident: అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదానికి ముందు మృతులు స్టేషన్ అధికారులతో గొడవ పడి రైల్వే పట్టాలపై కూర్చుని మద్యం తాగారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన మునికుమార్, అన్నమయ్య జిల్లాకు చెందిన వీరభద్రయ్యగా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story