పోలీసుల అదుపులో అమలాపురం అల్లర్లలో కీలక నిందితుడు

Anyam Sai: అమలాపురం అల్లర్లలో కీలక నిందితుడిగా ఉన్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 25 May 2022 6:56 PM IST
Annam Sai Arrest Over Amalapuram Violence
X

పోలీసుల అదుపులో అమలాపురం అల్లర్లలో కీలక నిందితుడు

Anyam Sai: అమలాపురం అల్లర్లలో కీలక నిందితుడిగా ఉన్న అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఆందోళనకు దిగిన అన్యం సాయి తాజా పరిణామాల్లో కీలక పాత్ర ఉందని పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు, నిరసన ప్రదర్శనలపై పోలీసులు విచారిస్తున్నారు.

కోన‌సీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ద‌ళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్న సమయంలో అన్యం సాయి ఆందోళనకు దిగాడు. ఈ క్రమంలోనే జిల్లాపేరు మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చొక్కా విప్పేసి కిరోసిన్ చేత బట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆది నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న సాయి అమ‌లాపురం అల్లర్లకు నేతృత్వం వ‌హించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story