ఏపీ సీఎంకు షాక్.. వైఎస్సార్ కాంగ్రెస్ నాదే అంటూ ఈసీకి ఫిర్యాదు..

ఏపీ సీఎంకు షాక్.. వైఎస్సార్ కాంగ్రెస్ నాదే అంటూ ఈసీకి ఫిర్యాదు..
x
Highlights

ఏపీలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదని... ఆ పేరు ఎవరు వాడకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అన్న...

ఏపీలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదని... ఆ పేరు ఎవరు వాడకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాషా. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ అని వాడుకుంటున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ .. వైఎస్సార్ అనే పదాన్ని వాడకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. వైఎస్సార్ అనే పదంతో రిజిస్టర్ అయిన ఏకైక పార్టీ అన్న వైఎస్సార్ పార్టీ ఒక్కటేనని వెల్లడించారు.

వైసీపీ వారి అధికార పత్రాలపై పూర్తి పేరు వాడకుండా వైఎస్సార్ అని రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఎంపీకి ఇచ్చిన షోకాజు నోటీసులో వైఎస్సార్ అని రాయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అనే పదం ఇతర వేరే పార్టీలు వాడకూడదని ఎస్ఈసీ గతంలోనే చెప్పిందనీ గుర్తుచేశారు. తమ పార్టీ పేరు వాడుతున్నందుకు అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వ్యాఖ్యానించారు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాషా.

Show Full Article
Print Article
Next Story
More Stories