Anil Kumar Yadav: ఆరోపణలు అసత్యమని ప్రమాణానికి నేను సిద్ధం.. లోకేష్ సిద్ధమా..?

Anil Kumar Yadav Fire On Lokesh
x

Anil Kumar Yadav: ఆరోపణలు అసత్యమని ప్రమాణానికి నేను సిద్ధం.. లోకేష్ సిద్ధమా..?

Highlights

Anil Kumar Yadav: లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిల్ ఫైర్

Anil Kumar Yadav: లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ తనపై చేసిన ఆరోపణలకు ప్రమాణానికి సిద్ధమా అంటూ అనిల్ సవాల్ విసిరారు. తాను ఆస్తులు కూడ పెట్టుకున్నట్లు లోకేష్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. శ్రీవెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా ..? అంటూ ఛాలెంజ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పక్కనపెట్టుకొని తనపై లోకేష్ ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తూ ఉన్నారన్నారు.

నెల్లూరు జన సమీకరణ కోసం లోకేష్ ఒక రోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారన్నారు. నెల్లూరు లో సభ పెట్టిన పక్కనే ఉన్న NTR విగ్రహానికి మాల వెయ్యకపోవడం సిగ్గుచేటన్నారు. తాను రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన ఆస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా..? అని సవాల్ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories