Anil Kumar Yadav: ప్రాణం ఉన్నంతవరకు జగన్‌తోనే ప్రయాణం

Anil Kumar Yadav Angry over Social Media Campaigns
x

Anil Kumar Yadav: ప్రాణం ఉన్నంతవరకు జగన్‌తోనే ప్రయాణం

Highlights

Anil Kumar Yadav: పార్టీలో ఉండవద్దు అని జగన్‌ చెప్పినా.. అక్కడే ఉంటా

Anil Kumar Yadav: రాజకీయాల నుంచి దూరమవుతాను... రానున్న ఎన్నికల్లో జగన్ బొమ్మతో ఓట్లు రాలవు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కావాలనే కొందరు మైండ్‌గేమ్ ఆడుతున్నారని...వారి ఆలోచనలు..ఆశలు నెరవేరవన్నారు. తనను కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని అనిల్ అన్నారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. దివంగత తన తండ్రి సాక్షిగా... రాజకీయాల్లో జగన్ వెంటే ప్రాణం ఉన్నంతవరకు నడుస్తానన్నారు. ఊపిరి ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి తోనే రాజకీయాలలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories