Botsa Satyanarayana: బొత్సకు అంగన్‌వాడీల నిరసన సెగ.. వీడియో తీయొద్దని మంత్రి వార్నింగ్‌

Botsa Satyanarayana: వినతులు చెబుతున్న అంగన్‌వాడీలను మాట్లాడనివ్వని బొత్స

Shekhar G
Published on: 8 Jan 2024 3:46 PM IST
Anganwadi Workers Stopped Minister Botsa Satyanarayana Car
X

Botsa Satyanarayana: బొత్సకు అంగన్‌వాడీల నిరసన సెగ.. వీడియో తీయొద్దని మంత్రి వార్నింగ్‌

Botsa Satyanarayana: మంత్రి బొత్సకు అంగన్‌వాడీల నిరసన సెగ తగిలింది. విజయనగరం జిల్లా గజపతినగరంలో మంత్రి కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు అంగన్‌వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం తమపై ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అరగంటపాటు రోడ్డుపైనే మంత్రి నిలబడాల్సి వచ్చింది. అయితే వినతులు చెబుతున్న అంగన్‌వాడీలను మాట్లాడనివ్వని బొత్స.. మళ్లీ ప్రభుత్వం వస్తే డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పారు. జర్నలిస్టులను కూడా వీడియో తీయొద్దని వార్నింగ్ ఇచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story