Anganwadi Workers: రాబోయే ఎన్నికల్లో జగన్‌కు మా ఉసురు తగులుతుంది

Anganwadi Workers: ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే రాష్ట్రానికి అరిష్టం

Shekhar G
Published on: 22 Jan 2024 4:04 PM IST
Anganwadi Employees Temporarily Called Off The Strike
X

Anganwadi Workers: రాబోయే ఎన్నికల్లో జగన్‌కు మా ఉసురు తగులుతుంది 

Anganwadi Workers: అనంతపురం జిల్లాలో 41 రోజులు పాటు అంగన్‌వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెను అధికారుల ఒత్తిళ్లను భరించలేక... తాత్కాలికంగా విరమించి... కంటతడి పెట్టుకొని విధులకు హాజరయ్యారు. గుత్తి ప్రాజెక్టు పరిధిలోని గుత్తి, గుంతకల్, పామిడి ప్రాంత అంగన్‌వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులు గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద కంటతడి పెట్టుకుంటూ... 41 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే రాష్ట్రానికి అరిష్టమని, జగన్‌కు రాబోయే ఎన్నికల్లో అంగన్‌వాడీ ఉద్యోగుల ఉసురు తగులుతుందంటూ మండిపడ్డారు. అంగన్‌వాడీ ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే తొలగించండంటూ కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేయడం... హేయమైన చర్య అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story