సభలో టీడీపీ తీరు పై స్పీకర్ అసహనం!

సభలో టీడీపీ తీరు పై స్పీకర్ అసహనం!
x
Highlights

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కూడా వాడీ-వేడిగా జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీ తీరు పైన అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సభలో పార్టీ తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కూడా వాడీ-వేడిగా జరిగాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీ తీరు పైన అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సభలో పార్టీ తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. అంతేకాకుండా సభ నిర్వహణకు కూడా సహకరించడం లేదని అన్నారు. సమావేశాల్లో భాగంగా పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి బయటకు పంపించారు. సభా సంప్రదాయాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.

దీనిపట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ప్రతిరోజు ఇలా సభను అడ్డుకోవడం దారుణంగా ఉందని అన్నారు. ఇలా వారిని రోజూ సస్పెండ్ చేయడం తనకి బాధగా ఉందని, కానీ వాళ్ళ ప్రవర్తనతో నాకు వేరొక ప్రత్యామ్నాయం లేదని అన్నారు.. సభను సక్రమంగా నడిపేందుకు సభలోకి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు తీసుకురావాలని పరిశీలిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు సహకరించాలని, ఈ విధంగా చేయడం సరికాదన్నారు స్పీకర్.

Show Full Article
Print Article
Next Story
More Stories