'అమరావతిపై జోక్యం చేసుకోలేం' : ఏపీ హైకోర్టు

అమరావతిపై జోక్యం చేసుకోలేం : ఏపీ హైకోర్టు
x
Highlights

అమరావతి నుంచి రాజధాని తరలింపుపై జోక్యం చేసుకోబోమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయమూ...

అమరావతి నుంచి రాజధాని తరలింపుపై జోక్యం చేసుకోబోమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని.. అందువల్ల దీనిపై జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. రాజధాని తరలింపుపై అత్యవసరంగా విచారణ జరపాలని లాయర్ సుబ్బారావు హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టు మాత్రం సుబ్బారావు అభ్యర్ధనను తోసిపుచ్చింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులే ఇవ్వలేదని.. పైగా విధాన పరమైన నిర్ణయం కూడా ప్రకటించలేదని అలాంటప్పుడు దీనిపై ఎలా జ్యోకం చేసుకోగలమని పిటిషనర్ ను హైకోర్టు ప్రశ్నించింది.

రాజధాని తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయించినా అది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ మంథాట సీతారామమూర్తి లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టి.. పిటిషనర్ సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్ తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. ఇదే క్రమంలో అమరావతి తరలింపు ద్వారా స్టేక్ హోల్డర్స్ ఎవరైనా నష్టపోతే పిటిషన్ వేసుకోవాలని సూచించింది. సంక్రాంతి సెలవుల తర్వాత ఎవరైనా పిటిషన్ వేయొచ్చని స్పష్టం చేసింది.

కాగా ప్రస్తుతం అమరావతిలో ఉన్న పూర్తి స్థాయి రాజధానిని విశాఖ, కర్నూలుకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ కాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూల్ లో జ్యూడిషియల్ క్యాపిటల్ లను ఏర్పాటు చెయ్యాలని భావిస్తోంది. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించాలని జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు అప్పటికే ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించాయి. అదే క్రమంలో అమరావతి, విశాఖలో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ నివేదికలో పేర్కొంది.

దాంతో ఈ కమిటీల ప్రతిపాదనపై బార్ అసోసియేషన్ మండిపడింది. హైకోర్టును కర్నూలుకు తరలించవద్దని బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. గతేడాది డిసెంబర్ 26, 27న విధులను కూడా బహిష్కరించి అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు. ఐతే బార్ అసోసియేషన్ నిర్ణయాన్ని కొందరు లాయర్లు వ్యతిరేకించారు. ఈ క్రమంలో లాయర్లు రెండు వర్గాలుగా చీలి పోటా పోటీగా పోరాటాలు చేస్తున్నారు. వారిలో కొందరు రాజధాని, హైకోర్టు అమరావతి లోనే ఉండాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై వాదనలు విన్న హైకోర్టు గురువారం కొట్టివేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories