ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం: ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోకి..

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం: ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలోకి..
x
Representational Image
Highlights

అంతకంతకూ కరోనా వ్యాధి వ్యాప్తి పెరిగిపోతూ వస్తోంది. కరోనావైరస్ ను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా...

అంతకంతకూ కరోనా వ్యాధి వ్యాప్తి పెరిగిపోతూ వస్తోంది. కరోనావైరస్ ను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 58 ప్రైవేటు ఆస్పత్రులను

ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. విశాఖలో 5, కృష్ణా జిల్లాలో 5, ప్రకాశం 4, నెల్లూరు 5, కర్నూలు 6, చిత్తూరు 5, కడప 3, అనంతపురం 4, గుంటూరు 4, తూర్పుగోదావరి 5, పశ్చిమగోదావరి 3, విజయనగరం 5, శ్రీకాకుళంలోని 4 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌-19 చికిత్సకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల సేవలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో 19,114 బెడ్లు, 1286 ఐసీయూ బెడ్లను వై ద్యఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. 717 ఐసోలేషన్‌ బెడ్లను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories