రేపు ఏలూరులో ఏపీ సీఎం జగన్ పర్యటన !

X
Highlights
రేపు ఏలూరులో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి... ఏలూరు అల్లూరి స్టేడియానికి చేరుకుంటారు.
Krishna3 Nov 2020 3:42 PM GMT
రేపు ఏలూరులో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి... ఏలూరు అల్లూరి స్టేడియానికి చేరుకుంటారు. వీవీనగర్ బెయిలీ బ్రిడ్జ్ సెంటర్ వద్ద అభివృద్ది పనులను సీఎం ప్రారంభించనున్నారు. 330 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. తిరిగి ఉదయం 11.57 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత పటిష్టంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు.
Web TitleAndhrapradesh CM Jagan will visit Eluru tomorrow
Next Story