తీవ్రంగా నష్టపోయాం.. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయండి!

CM Jagan Letter To Amit shah : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం జగన్ వరద భాదితులను ఆదుకునేందుకు ఆర్ధిక సహాయం చేయాలనీ పేర్కొన్నారు.

Krishna
Updated on: 17 Oct 2020 8:44 PM IST
తీవ్రంగా నష్టపోయాం.. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయండి!
X

CM Jagan Letter To Amit shah : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం జగన్ వరద భాదితులను ఆదుకునేందుకు ఆర్ధిక సహాయం చేయాలనీ పేర్కొన్నారు. అందుకు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు మంజూరు చేయాలనీ కోరారు. ఇక జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని ఏపీకి పంపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.4450 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని జగన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరమని జగన్ విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రానికి రూ.5వేల కోట్లు నష్టం జరిగిందని ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే..తక్షణ సాయంగా రూ.1,350కోట్లు అందించాలని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు!

Krishna

Krishna

Next Story