అక్టోబర్‌ 1న ఏపీ కేబినెట్‌ సమావేశం

అక్టోబర్‌ 1న ఏపీ కేబినెట్‌ సమావేశం
x
Highlights

అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా నూతన పాలసీలు, సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది..

అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా నూతన పాలసీలు, సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. కాగా ఈ నెల 3న నిర్వహించిన సమావేశంలో ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ అనే కీలక అంశంపై చర్చ జరిగింది.

ఈ సందర్బంగా ఆన్ లైన్ గేమ్ లు రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం విధించారు. అలాగే రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల దాదాపు మూడువేల కిలోమీటర్ల టెండర్లు కూడా రద్దు చేసింది. అలాగే సమావేశంలో ఏపీఎస్‌డీసీకి ఆమోదం, వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్‌ సిగ్నల్‌ వంటి పలు కీలక నిర్ణయాలకు సెప్టెంబర్ 3న మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాగా అక్టోబర్‌ 1న జరిగే సమావేశంలో విశాఖలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మాణం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories