ఏపీ సీఎస్ నీలం సాహ్నీని సత్కరించిన సీఎం జగన్

Arun Chilukuri
Published on: 18 Dec 2020 7:13 PM IST
ఏపీ సీఎస్ నీలం సాహ్నీని సత్కరించిన సీఎం జగన్
X

ఏపీ కేబినెట్ సందర్భంగా సచివాలయంలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఏపీ సీఎస్ నీలం సాహ్నీని సీఎం జగన్ కేబినెట్ భేటీ సందర్భంగా సత్కరించారు. ఈ నెలాఖరుతో నీలం సాహ్నీ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీకి హాజరైన నీలం సాహ్నీకి సీఎం జగన్ పుష్పగుచ్ఛం అందించారు. ఆపై శాలువా కప్పి గౌరవించారు. ఈ సందర్భంగా సీఎస్ నీలం సాహ్నీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా 2019 నవంబర్‌ 14న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నీ పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. సాహ్నీ 2018 నుంచి ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story