ఏపీలో కరోనా చికిత్సలో అధికంగా వినియోగిస్తున్న ఖరీదైన ఔషధం

ఏపీలో కరోనా చికిత్సలో అధికంగా వినియోగిస్తున్న ఖరీదైన ఔషధం
x
Highlights

కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తోంది. వైరస్‌కు మందుకాని, టీకా కాని లేకపోవడంతో చికిత్స కోసం పలు రాకాల ఇంజెక్షన్‌లు వాడటానికి ఐసీఎంఆర్‌...

కరోనా మహమ్మారి విశృంఖలంగా విజృంభిస్తోంది. వైరస్‌కు మందుకాని, టీకా కాని లేకపోవడంతో చికిత్స కోసం పలు రాకాల ఇంజెక్షన్‌లు వాడటానికి ఐసీఎంఆర్‌ అంగీకరించింది. దీంతో ఏపీలో కరోనా చికిత్స కోసం రెమిడెసివర్‌, టోసిలిజుమాబ్‌ ఇంజెక్షన్‌లు వాడుతున్నారు. మరి ఈ ఖరీదైన ఔషధం ఎలాంటి ఫలితాలు ఇస్తోంది. రాష్ట్రంలో వీటిని ఎలా అమలు చేస్తున్నారు.

రెమిడెసివర్‌ ఏపీలో అధికంగా వినియోగిస్తున్న ఖరీదైన ఔషధం. అవసరమైన దశలో రెమిడెసివర్‌, టోసిలిజుమాబ్‌ ఇంజెక్షన్లను వాడేందుకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చింది. దీంతో సుమారు మూడు నెలల నుంచి రెమిడెసివర్‌ 2.25 లక్షల వరకు, టోసిలిజుమాబ్‌ 2,400 యూనిట్ల వరకు వాడారు. రాష్ట్రంలో కొవిడ్‌ లక్షణాలు మధ్య, తీవ్ర దశల్లో ఉన్న బాధితులకు వైద్యుల సిఫార్సు మేరకు ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల చొప్పున ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు మాములు లక్షణాలు ఉన్న వీటిని వాడేస్తున్నారు. రోగి పరిస్థితి విషమంగా మారితే టోసిలిజుమాబ్‌ వాడుతున్నారు.

ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లోని బాధితులకు ప్రభుత్వం ఈ ఇంజెక్షన్లను ఉచితంగా అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా చాలా చోట్ల అమలుకావడం లేదు. ఫలితంగా బాధితులపైనే భారం పడుతోంది. మొత్తంగా ఎదురుగా ఉన్నా అందని ద్రాక్షలా మారిన ఈ ఇంజెక్షన్ల విషయంలో ప్రభుత్వం ఒక స్ధిరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories