దీక్షకు వెళ్లిన మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు- దేవినేని ఉమ

X
దేవినేని ఉమా ఫైల్ ఫోటో
Highlights
*వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా అనుమతిస్తారు- దేవినేని ఉమ *ప్రతిపక్షాలకు ఒక న్యాయం, వైసీపీకి ఒక న్యాయమా..?- దేవినేని ఉమ
Arun Chilukuri19 Jan 2021 1:11 PM GMT
బెజవాడ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. గొల్లపూడిలో దీక్షకు వెళ్లిన తమని అరెస్ట్ చేసి.. వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందన్నారు. పమిడిముక్కల పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఆయన.. వైసీపీ అరాచక ధోరణిపై తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Web TitleAndhra Pradesh Tdp leader devineni uma arrest
Next Story