కుమార్తె పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఇంట పెళ్లిసందడి నెలకొంది.

Samba Siva Rao
Published on: 27 Dec 2020 6:37 PM IST
కుమార్తె పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
X

తెలుగుదేశం పార్టీ దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఇంట పెళ్లిసందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె వివాహం త్వరలోజరగనుంది. ఈ క్రమంలో ఆయన ప్రముఖులను తన కుమార్తె పెళ్లికీ రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. చింతమనేని ప్రభాకర్ తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు. తన పెద్దకుమార్తె వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story