అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత

Arun Chilukuri
Published on: 11 Sept 2020 12:32 PM IST
అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత
X

తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. రథం ఆహుతైన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆ మేరకు హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. ఈనేపథ్యంలో అంతర్వేది ఘటనను సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఇవాళ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. సెక్షన్‌ 6, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. కాగా, సెప్టెంబర్‌ 5వ తేదీ శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నికి ఆహుతైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story