Andhra Pradesh: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై సజ్జల మండిపాటు
Andhra Pradesh: ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు -సజ్జల
సజ్జల రామకృష్ణ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: కరోనా విపత్కర సమయంలోనూ టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రాలకు టీకాలు, ఆక్సిజన్, మందులు తామే కేటాయిస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేశారు సజ్జల. ఇది తెలిసి కూడా చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అసత్య ప్రచారం కారణంగా టీకా కోసం రాష్ట్ర ప్రజలు పోటీ పడుతున్నారని, ఇది కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఛాన్స్ ఉందని అన్నారు సజ్జల.
ఇక.. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులను అడ్డుకోవడంపై స్పందించారు సజ్జల. ఇప్పటికే ఈ విషయం తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల మధ్య చర్చలు జరిగాయన్నారు. బోర్డర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సజ్జల.
Next Story




