విశాఖలో భారీగా హవాలా మనీ పట్టివేత

Arun Chilukuri
Updated on: 21 Dec 2020 6:30 PM IST
విశాఖలో భారీగా హవాలా మనీ పట్టివేత
X

విశాఖపట్టణంలో హవాలా మనీ కలకలం రేపుతోంది. హవాలా నగదును తరలిస్తున్న ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రట్టు చేశారు. రాజస్థాన్ కి చెందిన ఇద్దరి నుండి టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటి రూపాయాల నగదు, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణంలోని రైల్వేస్టేషన్ కు సమీపంలోని రెండు హోటల్స్ లో ఇద్దరు నిందితుల నుండి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ రైల్వేస్టేషన్ ను అడ్డాగా చేసుకొని హావాలా మనీని మార్పిడి చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దువ్వాడ పీఎస్‌ పరిధిలో ఓ ఇన్నోవా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story